ఇవాళ రాత్రినుంచి నిలిచిపోనున్న 80 శాతం ప్రైవేటు బస్సులు

హైదరాబాద్‌: ఇవాళ అర్థరాత్రి నుంచి అంతర్‌ రాష్ట్ర పన్నువిధానం అమల్లోకి రానుంది. పన్నుల భారంపై ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు నేడు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే ప్రైవేటు బస్సుల్ని నిలిపివేయాలని నిర్ణయించారు. దాంతో ఇవాళ రాత్రినుంచి 80 శాతం ప్రైవేటు బస్సులు నిలిచిపోనున్నాయి. ముందస్తు రిజర్వేషన్లను పలు ప్రైవేట్‌ సంస్థలు ఇప్పటికే నిలిపివేశాయి.