ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్‌ కన్నుమూత

బిలియనీర్‌, పద్మవిభూషణ్‌ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్‌ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్‌ ఫౌండేషన్‌ ట్విట్టర్ ఎక్స్‌లో ప్రకటించింది. ఆయన వారసుడిని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయనకు ప్రైవేట్ జెట్‌లు, ఒక ప్రైవేటు ద్వీపం ఉన్నాయి. ఆగా ఖాన్ సంపద 1300 మిలియన్లు ఉంటుందని అంచనా.