ఈక్వెడార్‌లో జీవించేందుకు సిద్ధం : అసాంజ్‌

కాస్‌బెరా : తాను ఈక్వెడార్‌లో జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌ శుక్రవారం తెలపారు. రాజకీయ అశ్రయం కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుకు ఆ దేశ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని వివరించారు. లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన తర్వాత తొలిసారిగా ఆయన స్పందించారు. ప్రస్తుతం స్వీడన్‌కు వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని, అక్కడికి వెళ్తే తనను అరెస్ట్‌ చేయొచ్చని తెలిపారు. అందువల్లే ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందానని వివరించారు. అలాగే వికీలీక్స్‌ వెబ్‌సైట్‌కు సంబంధించిన అభియోగాలపై తనను అమెరికాకు అప్పగించొచ్చని భయపడుతున్నట్టూ ఆయన ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ రేడియోకు ఇచ్చిన ఫోన్‌ ఇంటర్వ్యూలో తెలిపారు.