ఈనెల 10 నుంచి టేబుల్‌టెన్నిస్ పోటీలు
రాజమండ్రి: ఈ నెల 10 నుంచి రాజమండ్రిలో 3 రోజుల పాటు టేబుల్‌టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అధ్యక్షుడు భాస్కరరామ్ తెలిపారు. ఈ టోర్నీలో ఏడు విభాగాల్లో దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి జేకే గారెన్స్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు.