ఈనెల 4నుంచి ఎస్‌.ఎష్‌.ఐ మహాసభలు

హైదరాబాద్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ 14వ అఖిలభారత మహాసభలు ఈనెల 4నుంచి 7 వరకూ తమిళనాడులోని మధురైలో జరుగుతాయని ఎస్‌.ఎఫ్‌.ఐ జాతీయనేత చంద్రమోహన్‌ తెలిపారు. ఇందులో రాష్ట్రం నుంచి 174మంది ప్రతినిధులు మహాసభకు హాజరుకానున్నట్లు చంద్రమోహన్‌ వెల్లడించారు. 700మంది ప్రతినిధులు పాల్గొంటారని ఎస్‌.ఎఫ్‌.ఐ ప్రకటించింది.