ఈ నెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ

హైదరాబాద్‌:రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కోతలకు నిరసనగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించలేని ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్‌ తెలిపారు.