ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
శివ్వంపేట సెప్టెంబర్ 11 జనంసాక్షి : భగవంతుడి దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ఈ ప్రాంతం పాడి పంటలతో శోభితం కావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిపేర్కొన్నారు. మండల పరిధిలోని గోమారం గ్రామంలో గౌడ సంఘం సభ్యులు నెలకొల్పిన వినాయక విగ్రహాo వద్ద ఆదివారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా జిల్లా గ్రంధాల చైర్మన్ చంద్ర గౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, గోమారం సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, నాయకులు వాకిటి శశిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ సర్పంచ్ చెన్న, ఉప సర్పంచ్ నవీన్, చెన్నాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు రామచంద్రం, గోమారం గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రమైన
శివ్వంపేట లో మహాదేవ యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు వార్డు సభ్యులు వంజరి కొండల్, సంతోష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగల లక్ష్మీ నరసయ్య, గౌరీ శంకర్, వార్డు సభ్యులు శ్రీనివాస్ గణపతి దేవుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను యూత్ సభ్యులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాదేవ యూత్ సభ్యులు పాల్గొన్నారు.