ఈ ముగ్గురు విధి నిర్వహణలో ఉత్తములు

రుద్రూర్(జనంసాక్షి):
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను రుద్రూర్ తహసిల్దార్ మూజీబ్ మరియు రుద్రూర్ ఎస్సై రవీందర్ మరియు అంగన్వాడీ టీచర్ గంగామణి , నిజామాబాద్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్‌, చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నా విషయం తెలిసినదే. ఐతే రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ బుధవారం రోజున ముగ్గురిని గౌరవంగా ఆహ్వానించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శాలువా, పూల మాలలతో వారిని సత్కరించి వారు రుద్రూర్ మండలనికి చేసిన సేవలను మరోసారి కొనియడారు, ఈ కార్యక్రమంలో రుద్రూర్ తహసిల్దార్ మూజీబ్ , రుద్రూర్ ఎస్సై రవీందర్ , సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్,
అంగన్వాడీ టీచర్ బి గంగామణి ,
ఎంపీఓ సాయిలు, సెక్రెటరీ విట్టల్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు
ప్రతిమ, సునంద, పద్మ, రూపా, సావిత్రి, డి పద్మ, జి గంగామని నిస్సార్, తదితరులు పాల్గొన్నారు