ఈ రోజు కలెక్టరేట్‌ ముందు టీఆర్‌ఎస్‌ ధర్నా

ఖమ్మం : కృష్ణాడెల్టాకు నీరు విడుదలను నిరసిస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ ముందు ఈ రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు పాదయాత్ర చేపాట్టారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని సంఘీభావం తెలియజేశారు.