ఉగాది పండగ సందర్బంగా చిన్న తాండ్రపాడు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన

 

 

 

 

చిన్న తాండ్రపాడుగ్రామ0 ఐజ మండలంజోగులాంబ గద్వాల జిల్లా 3-4-2024

అయిజ ఎస్సై విజయ్ భాస్కర్

చిన్న తాండ్రపాడు మాజీ ఉప సర్పంచ్ మహేష్ నాయుడు

ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో ఉగాది పండగ సందర్బంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు అయిజ ఎస్సై విజయ్ భాస్కర్,చిన్న తాండ్రపాడు మాజీ ఉప సర్పంచ్ మహేష్ నాయుడు హాజరై ప్రారంభించారు…

– ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..

క్రీడలు మనిషి ఆరోగ్యంగా మరియు మానసికంగా ఎదగడానికి ఎంతోగానో ఉపయోగ పడతాయి అని అన్నారు. శారీరక దృఢత్వం (ఫిట్ నెస్ ) ఆటలు బాగా ఆడటం వలన శారీరకంగా శ్రమ కలుగుతుంది. కాబట్టి ఎముకలు, కండరాలలో పెరుగుదల ,మంచి రక్త ప్రసరణ ,మీ వయసుకు తగ్గ బరువు, అలాగే మెదడు , గుండె కూడా చక్కగా పనిచేస్తాయి అని అన్నారు.క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. అలాగే చిన్న తాండ్రపాడు గ్రామం నుంచి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి లో క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు.గ్రామలే దేశానికి పట్టుకొమ్మలు, వజ్రాల లాంటి క్రీడాకారులు గ్రామాల నుంచే పుట్టుకొచ్చి ఈరోజు జాతీయ స్థాయిలలో అంతర్జాతీయ స్థాయిలలో పోటీ పడుతున్నారు అని అన్నారుఈ కార్యక్రమం లో గ్రామస్తులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.