ఉజ్వల రెస్క్యూ హోం నిర్వాహకులపై స్థానికుల దాడి

హైదరాబాద్‌: రామాంతపూర్‌లోని ఉజ్వల రెస్క్యూ హోం నిర్వహకులపై స్థానికులు  దాడికి దిగారు. అమ్మాయిలను వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సిబ్బందిపై  దాడికి పాల్పడ్డారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం  నెలకొంది. రెస్క్యూ హోంలో  యువతలు అపహరణకు గురవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఈ ఘటనకు పాల్పడ్డారు.