ఉత్తమ పోలీస్ స్టేషన్గా జమ్మికుంటకు గుర్తింపు
హోంశాఖ జాబితాలో జమ్మికుంటకు ఐదో స్థానం
హైదరాబాద్,డిసెంబర3 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది. టాప్‌టెన్ జాబితాలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్‌స్టేషన్ నిలిచింది.
తొలిస్థానంలో మణిపూర్‌కు చెందిన నాంగ్‌పోక్‌షికమై పోలీస్‌స్టేషన్ నిలువగా, పదో స్థానంలో జమ్మికుంట ఠాణా నిలిచింది. దేశ వ్యాప్తంగా 16,671 పోలీస్‌స్టేషన్లకు వివిధ విభాగాల్లో స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. 2015లో గుజరాత్ కచ్‌లో జరిగిన డీజీపీల సదస్సులో పోలీస్‌స్టేషన్ల పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. డేటా విశ్లేషణ, పనితీరు పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఆయా పోలీస్‌స్టేషన్లకు ¬ంశాఖ ర్యాంకులు ప్రకటిస్తోంది. ఆస్తులకు సంబంధించిన నేరాలు, మహిళలపై దాడులు, బలహీన వర్గాలపై దాడులు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తుల ఆచూకీ గుర్తింపు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకటించిన ర్యాంకుల్లో టాప్10లో జమ్మికుంట పోలీస్‌స్టేషన్ నిలువడంపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సిబ్బందిని అభినందించారు. టాప్‌టెన్‌లో నిలిచినందుకు గర్వపడుతున్నట్లు ట్వీట్ చేశారు.