ఉత్తరప్రదేశ్‌లో చలిగాలులకు 26 మంది మృతి

లక్నో: చలి తీవ్రత ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో చలిగాలులకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృత్యువాతపడ్డారు. బస్తీలో 6, జాన్‌పూర్‌లో 4, బాలిలయాలో 4, మిర్జాపూర్‌లో 2, వారణాసి, భదోని, యందాలీలో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలియజేశారు. మంచు ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో చోటుచేస్తున్న రోడ్డు ప్రమాదాల్లో మరో ఏడుగురు మృతి చెందినట్లు చెప్పారు. ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోతుండటంతో లక్నోలోని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 5 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.