ఉపకారాగారాన్ని సందర్శించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి

నర్మల్‌పట్టణం. మండల న్యాయ నేవా సంస్థ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంతాచారి శనివారం పట్టణంలోని ఉప కారాగారాన్ని సందర్శించారు. అక్కడ అందిస్తున్న సౌకర్యాలపై ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు, సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఖైదీల హక్కులను వివరించారు. ఈయన వెంట జైలర్‌ శశికాంత్‌ ఉన్నారు.