ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ను కలిసిన శరద్‌పవార్‌

ముంబయి: ఎన్‌సీపీ మంత్రుల రాజీనామలను తిరస్కరించామని, రేపటినుంచి వారు యధావిధిగా విధులకు హాజరువుతారని కేంద్ర మంత్రి శరద్‌పవార్‌ తెలిపారు. ఈరోజు ఆయన ముంబయిలో రాజీనామ చేసిన ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ను కలిశారు. అజిత్‌ పవార్‌ రాజీనామాను ఆమోదించాలని మహారాష్ట్ర సీఎంను కోరతానని శరద్‌ పవార్‌ చెప్పారు.