‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

తొర్రూరు, మే26 (జనంసాక్షి) :
గ్రామీణ ప్రాతాలోని వలసలను నిరోధించి పేద ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ పెట్టిన ఉపాధి హామి పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరయ్యం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని మేట్ల సంఘం గౌరవ అధ్యక్షులు ముంజంపల్లి వీరన్న, మండల అధ్యక్ష కార్యాదర్శులు గజ్జి యాకయ్య, భీకులు ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి బడ్జెట్‌లో ఉపాధి హామి పథకానికి క్రమక్రమంగా తగ్గించడం, సిబ్బందిని నియమించకపోవడం, కూలీల సమస్యలను పరిష్కరిచకపోవడం చూస్తుంటే ఉపాధి పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర పూరితంగా ఉన్నారని వారు అన్నారు. వ్యవసాయ రంగ పనులకు ఉపాధి హామి పథకాన్ని వర్తింపచేయాలని, పని ప్రదేశంలొ కనీస వసతులను కల్పించాలని, మేట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మండలంలోని చింతలపల్లి గ్రామంలో మేట్ల సంఘం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎల్లయ్య, ఉపాధ్యాక్షులుగా వడ్లకొండ వెంకటయ్య, అరుణ, కార్యదర్శిగా వెంకన్న, సహయ కార్యదర్శులుగా మమత, సోమిరెడ్డి, శ్రీనివాస్‌, సుమలత, చిలుకమ్మ భవాని, మహేష్‌, తదితరులను ఎన్నకున్నారు. ఈ కార్యక్రమంలో మేట్ల మండల ఉపాద్యాక్షులు శోభ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.