ఉపాధి హామీ కూలి మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కుటుంబాన్ని సందర్శించిన సిపిఐ నాయకులు.

 

ఎల్కతుర్తి జూన్ 7 జనంసాక్షికేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకాన్ని నిధులు తగ్గింపు మూలంగా గ్రామీణ పేదలకు జీవన ఉపాధిగా ఉపయోగపడవలసిన ఉపాధి హామీ పథకం మృత్యుకోరలుగా మారిందని సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి ఆరోపించారు.ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన కట్కూరి మొగిలి 55 ఉపాధి హామీ పథకం భాగంగా బుధవారం ఉదయం పనిచేస్తుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు లోనై మృతి చెందాడు. మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా  చెల్లించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ గ్రామీణ పేదలకు జీవనోపాధిగా ఉపయోగపడే పనిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి పథకానికి నిధులను తగ్గించడం మూలంగా పని ప్రదేశంలో కూలీలకు కావలసిన మంచి నీరు , టెంటు సౌకర్యాలు, ప్రాథమిక చికిత్స  అందించడానికి కావలసిన వైద్య పరికరాలు సైతం లేకుండా ఉన్నాయి. అందుకు సరిపడా నిధులలో  కోత పెట్టడం మూలంగా  పని ప్రదేశంలో కావలసిన  సదుపాయాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేసే ప్రదేశాలలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం మూలంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అధికారులు పని ప్రదేశాల్లో కూలీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మారుపాక అనిల్ కుమార్ డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మధ్యల ఎల్లేష్ , మండల కార్యదర్శి ఊటుకూరి రాములు, మర్రి శ్రీనివాస్, శనిగరం రాజకుమార్, కామెర వెంకటరమణ,నిమ్మల మనోహర్, మాలోత్ శంకర్ నాయక్ మరిపెళ్లి తిరుమల, గడ్డం రాజనర్స్ తదితరులు పాల్గొన్నారు.