ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌:ఉపాద్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌ రోజు నుంచి ప్రారంభం కానుంది తొలుత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కౌన్సిలింగ్‌ మొదలవుతుంది.ఈనెల 4వ తేదీ 8 వరకు మిగిలిన కేటగిరిల వారికి కౌన్సిలింగ్‌ ప్రారంభమవు తుంది ఇందులో తెలుగు ఉర్ధూ,ఇంగీషు మీడియం పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లు సెకండరీ గ్రెడ్‌ టీచర్లు భాషొపాద్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు,ఇతర విభాగాల ఉపాద్యాయుల బదిలీలను పూర్తి చేస్తారు.బదిలీల కోసం ఈసారి వూహించని విధంగా 1.95 లక్ష దరఖాస్తులు అందాయి.న్యాయస్థానాలు ఉత్తర్వులను అనుసరించి తీసుకోవల్సిన చర్యలను దృషిలో పెట్టుకుని నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.