ఉప్పల్లో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌: ఉప్పల్లో అదృష్యమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కందిమళ్ల ప్రమీల అనే మహిళ నల్గోండ జిల్లా చౌటుప్పల్‌ వద్ద దారుణ హత్యకు గురైంది. హబ్సిగూడలోని శ్రీసాయి. అపార్ట్‌ట్‌మెంట్‌లో ప్రమీల అనే మహిళ స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ తన ఇద్దరి పిల్లలతో కలసి ఉంటుంది. శనివారం బయలకు వెళ్లి ఇంటికి రాకపోవటంతో ప్రమీల బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాద్‌ చేశారు. ఈ రోజు శవమై కనిపించింది. ఇటీవల బోడుప్పల్‌లోని ఓ భూమి గురించి ఆమెకు కొందరితో గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. హత్యకు ఇదే కారణం అయివుంటుందని అభిప్రాయ పడుతున్నారు.