ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించండి

సింగరేణి కార్మికుల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కార్మిక సంఘాల్లో కేవలం ఒక్క ఏఐ టీయూసీికి మాత్రమే ఉందని అలాంటి సువర్ణ చరిత్ర కలిగిన ఏఐటీయూసీని రానున్న గుర్తింపు సంఘ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ శాసనసభాపక్ష నేత, రాష్ట్ర ఏఐటీయూసీ నాయకుడు గుండా మల్లేష్‌ కార్మికులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక కేటీకే 2వ గని ఆవర ణలో ఫిట్‌ కార్యదర్శి ఎన్‌. చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం నైజాం చెరల్లో మూలు గుతున్న సింగరేణి కార్మికులకు మొట్టమొదట ఏఐటీయూసీ నాయకత్వాన సంఘం పెట్టడం జరిగిందని ఆ రోజుల్లో కార్మికులపై జరుగుతున్న దోపిడికి, పీడనకు వ్యతిరేకంగా అనేక పోరా టాలను జరిపి హక్కులను సాధించిన చరిత్ర ఏఐటీ యూసీ ఉందని, ఆరు అణాపైసల జీతం నుంచి అరవై వేల వరకు జీతాలు పెంచిన చరిత్ర ఏఐటీ యూసీిదని అలాంటి చరిత్ర కలిగిన ఏఐటీయూసీ ఓటేస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఏఐటీయూసీ కేంద్ర నాయకులు మంద మల్లారెడ్డి 2011 జూన్‌ లో కార్మికుల సమస్యలైన 47 డిమాండ్లపై సమ్మె శంఖాన్ని పూరించి సమ్మె లోకి దిగితె సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయటంతో బెంబేలెత్తిన యాజమాన్యం లోపాయి కారిగా ఐఎన్‌టీయూసీ, టిబిజికెఎస్‌, హెచ్‌ఎంఎస్‌ సంఘాలను లోబర్చుకొని తమ నీచబుద్ధితో సమ్మెను విచ్చిన్నం చేశాయని విమర్శించారు. 47 డిమాండ్లను పరిష్కరించాలంటే 8వందల కోట్లు ఖర్చవుతుందని యాజమాన్యం పోస్టర్ల ద్వారా తెలి పిందని సమ్మె విజయవంతం అయితే ఆ 8వందల కోట్లు కార్మికులకు చెందేవని అలా జరగకుండ కార్మికుల నోట్లో మట్టి కొట్టింది ఐఎన్‌టియుసి, టిబిజికెఎస్‌, హెచ్‌ఎంఎస్‌ లేనని ఆయన విమ ర్శించారు. ఈ సమావేశంలో బ్రాంచి కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, నాయకులు కొత్తపెల్లి ఏడు కొండలు, అంజయ్య, మల్లయ్య, కనుకయ్య, రాజిరెడ్డి, విజేందర్‌, నాగేశ్వరరావు, శంకర్‌, భాస్క ర్‌, ప్రభాకర్‌, కరీముల్లా, బిక్షపతి, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.