ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు వస్తాయని కేంద్ర మంత్రి వాయలార్‌ రవి తెలిపారు.ఈ రోజు       మీడియాతో  మాట్లాడుతూ ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని వాయలార్‌ పేర్కొన్నారు.వైఎస్‌ మరణంపై తానేమీ మాట్లాడనని చెప్పారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ వచ్చిన వాయలార్‌ రవి పీసీసీ చీఫ్‌ బొత్స,సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌తో విడివిడిగా భేటీ అయ్యారు.