ఉప రాష్ట్రపతిగా కాంగ్రెసేతర వ్యక్తికే సీపీఎం మద్దతు

చెన్నై: కాంగ్రెస్‌ పార్టీకి చెందని వ్యక్తికి ఉపరాష్ట్రపతిగా సీపిఎం మద్దతు ఇవ్వనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్‌ ఈ విషయం ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తిని ఉప రాష్ట్రపతి పదవికి తాము కోరుకుంటున్నామని, దీన్ని బట్టి అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోవాలో యూపీఏనే నిర్ణయించుకోవాలని సీపీఎం ప్రధానికి తేల్చిచెప్పింది. పార్టీ రాష్ట్రకమిటీ సమావేశాల్లో పాల్గోనడానికి చెన్నై వచ్చిన ప్రకాశ్‌ కారత్‌ ఈ విషయం పేర్కొన్నారు.