ఉభమసభలు మధ్యాహ్నం 12 గం వరకూ వాయిదా

ఢిల్లీ:పార్లమెంటు ఉభయసభలు ఈరోజు ప్రారంభం అయిన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. గత వారం రోజులుగా బొగ్గు కుంభకోణం వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న ఆందోళన సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తూ వాయిదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే.  ఈరోజు కూడా అదే కారణంతో సభలు వాయిదా పడ్డాయి.