ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా  పడ్డాయి. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ మృతికి సంతాపంగా ఉభయ సభలను ఎల్లుండికి వాయిదా వేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌లు ప్రకటన చేశారు. కాలేయ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందూతూ మంత్రి విలాస్‌రావ్‌ ఈ రోజు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.