ఊరూ వాడ ఒకటై జయశంకర్‌సార్‌కు జై కొట్టిన తెలంగాణ


పొడిచేటి పొద్దుల్లో, వీచేటి గాలుల్లో.. తెలంగాణ గుండె గొంతుకలో
జై తెలంగాణ నినాదంలో జయ శిఖరమై జయశంకర్‌ సారు మనవెంట నడుస్తనే ఉండు.
ఐక్యతే ఆయుధమని, కలిసి కొట్లాడుండ్రని మన భుజం తట్టి నడుపుతనే ఉండు.
నీ త్యాగం, నీ తెగువ, నీ నినాదం వృథా కాలేదు. అది నాలుగు కోట్ల గొంతుకల సింహకంఠ నాదమై నినదిస్తోంది. పురుడు పోసుకున్న పోరన్ని మొదలు కాటికి కాలు చాపిన వృద్ధుని వరకూ నీ జెండా పట్టుకుని పోరుబాటలో ముందుకురుకుతుండ్రు. వలస పాలకుల చేతుల్ల్లో నుంచి స్వతంత్రం లాక్కునే సమయం ఎంతో దూరంలో లేదు. నీ యాదిలో ఊరూ ,వాడా ఒక్కటై జై తెలంగాణ నినదిస్తుంది. తెలంగాణ సాధించుకుని మరింత వినయంగా వచ్చే సంవత్సరం నీకు నివాళులర్పిస్తాం.