గోదారికి వరదొచ్చే..


భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయానికి నీటిమట్టం 40.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నది ఉద్ధృతి వల్ల గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 23 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం.. నేడు 40.5 అడుగులకు చేరింది. దీంతో స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు- వరదనీటిలో మునిగిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సీత వాగు వద్ద నార చీరల ప్రాంతం, సీతమ్మ వారి విగ్రహం వరద నీటిలో మునిగిపోయింది. గోదావరిలో నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.