ఎంఐఎం తొత్తుగా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారు: కిషన్‌రెడ్డి

బాగ్‌లింగంపల్లి: పాతనగరంలోని భాగలక్ష్మి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి  పనులను ఎంఐఎం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ భాజపా ర్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లిలోని సందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతాసేలా వ్యవహిరిస్తుంటే తెదేపా, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు స్పందించకపోవడం బాధకరమన్నారు. ఎంఐఎం తొత్తుగా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బండారు. దత్తాత్రేయ, లక్ష్మణ్‌, బద్దం బాల్‌రెడ్డి, రాష్ట్రనాయకులు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు