ఎడతెరిపివర్షాలు కురుస్తునంగా ప్రజలు జాగ్రత్తలు పాటించండి . కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని . – కేచ్పల్లి సర్పంచ్ బిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మద్దెల మంజుల

జనంసాక్షి ,: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వలిగొండ మండలంలోని ప్రజలు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం వాగు సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్ల లో మ్యాన్ హోల్స్ ఉన్నాయా చూసి జాగ్రత్తగా పిల్లలు చూసి వెళ్లాలని అన్నారు ఎప్పటికప్పుడు వర్షా ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు మండల మహిళా అధ్యక్షురాలు సర్పంచ్ మద్దెల మంజుల పిలుపునిచ్చారు. తమకు ఎలాంటి సహాయం కావలసి వచ్చిన పరిష్కరించేందుకు మమ్ములను, వార్డు గ్రామ మండలాల్లో ఉండే నాయకులను అధికారులను సంప్రదించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఉండడానికి పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సైతం ఏర్పాటు చేస్తారు ఆమె తెలిపారు. వర్షాల వల్ల కలిగే సిజినల్ వ్యాధులు రాకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోనీ, చెత్తను తమ పారిశుధ్య సిబ్బందికి అప్పగించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న గృహములలో ఉండకూడదని, అలాగే విద్యుత్ స్తంభాల దగ్గరకు ఎవరు వెళ్లకూడదని, ప్రజలు అధికారుల, ప్రజాప్రతినిధుల సూచనలు సలహాలు పాటించాలన్నారు.