ఎన్టీపీసీ 7వ యూనిట్‌ నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల 7వ యూనిట్‌లో సాంకేతికలోపంతో శుక్రవారం విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లోని ఓట్యూబు లీకవటంతో యూనిట్‌ ట్రిప్పయింది. అధికారుల లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టారు.