ఎన్నికల సంఘం న్యాయఅధికారి బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయధిఅకారిగా పనిచేస్తున్న ప్రభాకరరావును శ్రీకాకుళం జిల్లా ఫ్యామిలీ కోర్టుకు బదిలీ  చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గాలి బెయిలు ముడుపుల కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేరు ఉన్నందునే అయణ్ని బదీలి చేసినట్లు సమాచారం.  గాలి బెయిలు వ్యవహారంలో పట్టాభికి ప్రభాకర్‌రావు రూ. 10 కోట్లు ఇవ్వజూపినట్లు ఈ కేసులో అరెస్టైన నిందితుడు రవిచంద్ర వాంగ్మూలం ఇచ్చాడని ఏసీబీ నివేదికలో పేర్కొంది.