ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణ

తిరుపతి: తిరుపతిలో ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణకు గురైంది. చెన్నైలోని ఆర్కాడు ప్రాంతానికి చెందిన తంగప్రియ, రాజాలు తమ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు వచ్చారు. వీరి కుమారుడు ప్రత్యూత్‌కు పుట్టువెంట్రుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం శనివారం రాత్రి దర్శినం ముగించుకొని యాత్రికుల ఉచిత వసతి సముదాయం-3లోని ఒకటో హాల్‌లో నిద్రించారు. ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తిరుమల రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలాసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.