ఎన్ కౌంటర్ పై వారిది రాజకీయ రాద్ధాంతమే:చిన్నరాజప్ప

తూ.గో: ఎన్ కౌంటర్ పై తమిళ పార్టీలు, హక్కుల సంఘాలు రాజకీయ కోణంలో రాద్ధాంతం చేస్తున్నాయని ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు.ఆయన కాకినాడలో మాట్లాడుతూ… స్మగ్లర్లకు 6 నెలలుగా హెచ్చరికలు చేస్తూనే ఉన్నామని, 100 కేసులు పెట్టినా వాళ్లలో మార్పులు రాలేదని తెలిపారు. ఎర్రచందనం ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు. తమిళనాడుకు ఆర్టీసి బస్సులు నిలిచిపోవడంపై రెండు ప్రభుత్వాలు శాంతియుత చర్చలు జరపాలని సూచించారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం మారదని స్పష్టం చేశారు.