ఎమ్మార్‌ కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవకు సీబీఐ కోర్టు ఈరోజు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మార్‌ కేసులో విజయరాఘవను జనవరి 28న సీబీఐ అధికారులు అరెస్టుచేశారు.