ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: ఇటీవల ఉప ఎన్నికల్లో శాసన సభ్యునిగా ఎన్నికైన తోట త్రిమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా త్రిమూర్తులు గెలుపొందిన విషయం తెలిసిందే. సభాపతి నాదెండ్ల మనోహర్‌ ఆయనతో ఇవాళ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు తోట నరసింహం, విశ్వరూవ్‌ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కులమతాలకు అతీతంగా తాను పనిచేస్తానని, తన సామాజిక వర్గ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ బరిలో దింపినప్పుడే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలిపోయిందని త్రిమూర్తులు వాఖ్యానించారు.