ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు.

ఫోటో రైటప్: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు స్వీట్ తినిపిస్తున్న మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా.
బెల్లంపల్లి, ఆగస్టు12, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు, ఇతర మహిళలు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు తినిపించారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా, ఇతర మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.