-->

ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామాతోనే అభివృద్ది: వివేక్‌

మంచిర్యాల,అగస్టు12(జనం సాక్షి): క్యాతన్‌ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి సంఫీుభావం తెలిపారు. హూజురాబాద్‌కు వచ్చిన నిధులు.. మిగిలిన నియోజకవర్గాలకు రావాలన్నా.. నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలన్నా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన అన్నారు.
దీక్షాస్థలిలో వివేక్‌ వెంకటస్వామి విూడియాతో మాట్లాడారు. ’చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామా చేస్తేనే సింగరేణి ప్రాంతంలో అందరికీ ఇండ్ల పట్టాలు వస్తాయి. సుమన్‌ ని రిక్వెస్ట్‌ చేస్తున్నా… హుజూరాబాద్‌ లో అమలు చేస్తున్న దళితబంధుతో పాటు మిగతా పథకాలు చెన్నూర్‌ లో కూడా అమలు చేయాలని కేసీఆర్‌ ని అడుగు. చెన్నూర్‌ నియోజకవర్గంలో కాళేశ్వరం రివర్స్‌ వాటర్‌ తో నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని సుమన్‌ ని కోరుతున్నా. కేసీఆర్‌ సీఎం అయ్యాక.. అవినీతితో గచ్చిబౌలి ప్రాంతంలో రెండు వేల ఎకరాలు కొన్నారు’ అని ఆయన అన్నారు.