ఎమ్మెల్యే షిండే జనంసాక్షి కాలెండర్ ఆవిష్కరణ
బిచ్కుంద మార్చి 04 (జనంసాక్షి) తెలంగాణ స్వరాష్ట్ర సమరయోధ పత్రిక జనంసాక్షి 2023 కాలెండర్ ను కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శనివారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజములో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమాచారము అందించేందుకు వారధిలా పని చేయాలని కోరారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.