ఎర్రగడ్డ బాటా చెప్పుల షాపులో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని ఎర్రగడ్డ బాటా చెప్పుల దుకాణంలో ఆదివారం అర్థరాత్రి ఆగ్నిప్రమాదం సంభవించింది. షాపులో ఉన్న చెప్పులకు, ఇతర సామాగ్రికి మంటలు అంటుకోవడంతో పెద్దఎత్తున్న మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియజేశారు.