ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని కల్లేటివాగులో మంగళవారం ఉదయం పోలీసులు 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర టన్నుల బరువుగల ఈ దుంగల విలువ రూ.60 లక్షలు ఉంటుందని తెలియజేశారు. తమిళనాడుకు తరలించేందకు స్మగ్లర్లు దుంగలను ఓ వాహనంలో సిద్దంగా ఉంచిన సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే పోలీసులను చూసిన దుండగులు దుంగలను వాగులో చెల్లాచెదురుగా పడేసి పారిపోయరు.