ఎలక్ట్రానిక్‌ మీడియా సంయమనం పాటించాలి:పోలీసు కమీషనర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ ఈ రోజు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయినారు. గణేష్‌నిమజ్జనం, తెలంగాణ మార్చ్‌ సంధర్భంగా సంచలనం కోసం వూహ జనితాలు, కల్పితాలను ప్రసారం చేయద్దన్నారు. ఈ నెల29న గణేష్‌నిమజ్జనం, 30న తెలంగాణ మార్చ్‌లను దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.