ఎలిజబెత్‌ జీతం పెరిగింది

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ వార్షిక వేతనం 20 శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36 మిలియన్‌ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం 30 మిలియన్‌ పౌండ్లు. ఎలిబిత్‌(85) బ్రిటన్‌ రాణిగా గద్దెనెక్కి ఈ నెలతో 60 ఏళ్లు పూర్తవుతాయి. వజ్రోతవ వేడుకలు జరుపుకొంటున్న సమయంలోనే వేతనం కూడా పెరగడం విశేషం. ఆమె ఆస్తులు రికార్డు స్థాయిలో 240.2మిలియన్‌ పౌండ్ల లాభాలు ఆర్జించినట్లు క్రౌన్‌ ఎస్టేట్‌ సీఈ ఎలిసన్‌ సిమ్మో తెలిపారు.