ఎల్ – 31 కాలువకు సాగునీరు విడుదల – ఎస్సార్ఎస్పి ఈఈ తో ఫోన్ లో మాట్లాడి నీళ్లు విడిపించిన కిసాన్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ వైనాల రాజు

జనం సాక్షి , కమాన్ పూర్ : ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి మంథని ప్రాంతానికి వారబంది ప్రకారం నీటిని విడుదల చేయవలసి ఉండగా శుక్రవారం రాత్రి నుండి ఎస్సారెస్పీ డి – 83 పరిధిలోని 31 ఎల్ కు నీటి సరఫరా ఆగిపోవడం జరిగింది. తక్షణమే జూలపల్లి రైతులు కమాన్ పూర్ మండలానికి సంబంధించిన రైతులు, ములకలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అందరితో కలిసి కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ వైనాల రాజు ఆధ్వర్యంలో 31 ఎల్ కాల్వ వద్దకు శనివారం చేరుకొని అక్కడి నుండి ఇరిగేషన్ శాఖ ఈఈ బలరామయ్య తో ఫోన్లో మాట్లాడి 31 ఎల్ ఉపకాల్వకు నీటిని విడుదల చేయుటకు ఒప్పించారు. ఇందులో భాగంగా ఏఈ ప్రసాద్, లష్కర్లు ఎస్సారెస్పీ 31 ఎల్ వద్దకు చేరుకొని నీటి విడుదలకు సహకరించారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి గ్రామ ఎంపీటీసీ శవ శంకర్, రైతులు నీర్ల లింగయ్య, బొజ్జ సతీష్ ఎండి తాజుద్దీన్, రామకృష్ణ వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.