ఎసిబి వలలో విద్యుత్‌ ఎఇ

నల్లగొండ,మార్చి 25(జ‌నంసాక్షి):  జిల్లాలోని నార్కట్‌పల్లి విద్యుత్‌ శాఖ ఏఈ అబ్జల్‌ బాబా ఏసీబీకి దొరికిపోయాడు. రైతు కందాల పాపిరెడ్డి నుంచి రూ. 18 వేలు లంచం తీసుకుంటుండగా బాబాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాబా నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రైతుకు విద్యుత్‌ కనెక్షన్‌కు సంబంధించి లంచం అడగడంతో అతను ఎసిబిని ఆశ్రయించాడు. దీంతో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.