ఎస్టీ హోదాతోనే వడ్డెర్ల అభివృద్ధి సాధ్యం
: అయిలమల్లు * వలిగొండ ఏప్రిల్ 03 అనాదిగా వెనుకబాటుకు గురవుతున్న వడ్డెర్ల లో ఎస్టీ హోదాతోనే అభివృద్ధి సాధ్యమని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని కమ్మగూడెం ఆర్.బి.ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంఘం స మావేశంలో ఆయన మాట్లాడారు. పోరాటంలో వడ్డెర యువత కీలకపాత్ర పోషించాలని, వడ్డెర మేధావులు,విద్యావంతులు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. అనంతరం జిల్లా కమిటీని 16 మండలాల స్థాయి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను రాష్ట్ర అధ్యక్షులు అయిలమల్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వలిగొండ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు గొలుసుల నరసింహ అంజయ్య పాల్గొన్నారు