ఎస్సీలకో న్యాయం,అగ్రవర్ణాలకో న్యాయం ఉంటుందా! :కల్పన

హైదరాబాద్‌: టీడీపీలో ఎస్సీలకు న్యాయం జరగదని ఉప్పులేటి కల్పన అన్నారు. ఎస్సీలకో న్యాయం, అగ్రవర్ణాలకో న్యాయం ఉంటుందని  ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలినైన నన్ను కనీసం సంజాయిషీ కూడా అడుగకుండా ఉద్దేశ్యపూర్వకంగానే పార్టీ నుంచి పంపించి వేశారని విమర్శించారు. ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. జనం జగన్‌ను నమ్ముతున్నారని అందుకు తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నానని  అన్నారు.