ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టబద్దతకు ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 30, డిసెంబరు 1న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరపనున్నట్లు చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెలియజేశారు. ఎస్‌సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గండ్ర పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం కోరడం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను వ్యతిరేకించడమేనని గండ్ర అభిప్రాయపడ్డారు.