ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం
గరిడేపల్లి, సెప్టెంబర్ 2 (జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను ప్రాథమిక పాఠశాల కాల్వపల్లి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు ఎంపిటిసి మహాలక్ష్మి గోవింద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్తయ్య ఉపాధ్యాయురాలు సుజాత చేతుల మీదుగా దుస్తులను అందజేశారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమధ్యమం ప్రవేశపెట్టడం అభినందనీయం అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్ ,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.