ఏకీభిప్రాయంతో లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం

ఫరూఖాభాద్‌: రాజకీయపార్టీల ఏకాభిప్రాయంతో లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు. ఈ దిశగా తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆందోళనలు, పోరాటాలతో బల్లు ఆమోదం పొందదని పేర్కొన్నారు. లోక్‌పాల్‌ బిల్లును కేంద్రం పట్టించుకోవడం లేదన్న అన్నా బృందం విమర్శలను ఆయన ఖండించారు.