ఏడాది తర్వాత ప్రజల సందర్శన కోసం కిమ్‌ జాంగ్‌ మృతి దేహం

ప్యోంగ్‌యంగ్‌ : ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణించిన సంవత్సరం అనంతరం భద్రపరిచిన ఆయన మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వం తొలిసారిగా ప్రజల సందర్శన కోసం ఉంచింది. కిమ్‌ మొదటి వర్థంతి సందర్భంగా ప్రభ్తుత్వ ఈ ఏర్పాట్లు చేసింది. కొరియా వర్కర్స్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయిన కిమ్‌ తన తండ్రి మరణం అనంతరం ఉత్తర కొరియా బాధ్యతలను 1994 నుంచి 2011 వరకు చేపట్టారు. డిసెంబర్‌ 17, 2011న రైళ్లో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.