ఏడు స్థానాల్లో వైకాపా విజయం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైకాపా ఏడింటిలో గెలుపొంది. 9 చోట్ల  మందంజలో కొనసాగుతోంది. ఎమ్మిగనూరు, ప్రతిపాడు, మాచర్ల, పోలవరం, రాయదుర్గం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో  ఆపార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 12 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి తిరుపతి, రాజంపేట, అనంతపురం,రామచంద్రాపురం,ఒంగోలు, నరసన్నపేట, రైల్వేకోడూరు, పాయకరావుపేటలో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.